చిత్రం చెప్పే విశేషాలు

(25-06-2024/1)

విజయవాడ హైవేలోని ఆటోనగర్‌ మలుపులో సోమవారం సాయంత్రం సంధ్య వేళ సూరీడు అస్తమిస్తూ కనువిందు చేశాడు. రోడ్డుకు ఎదురుగా కిందికి జారిపోతున్నట్లు కనిపించాడు.

 తిరుమల శ్రీవారిని సినీనటి శ్రీలీల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

సీఎం చంద్రబాబు మంగళవారం కుప్పంలో పర్యటించారు. హంద్రీ-నీవా కాలువను పరిశీలించారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి పుష్పగుచ్ఛం అందించారు.  

బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణలో సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పలువురు మోడల్స్‌ హాజరై ఫొటోలకు పోజులిచ్చారు.

 డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.

సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ బాలకృష్ణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి రావాలని ఆహ్వానం అందించారు.  

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home