చిత్రం చెప్పే విశేషాలు

(26-06-2024)

నీలాల నింగి.. వెండి మబ్బుల నీడన తిరుమల శ్రీవారి నిలయం చూపరులను ఆకట్టుకుంది.

వర్షాలు మొదలవడంతో హైదరాబాద్‌ నగర శివారులో ఈ రైతుకు కూలీలు దొరక్క తన 4 ఎకరాల పంట భూమిలో కూరగాయల సాగుకు కలుపు తీస్తూ కనిపించాడు.

సముద్రంలోని రాళ్లు ఉండే ప్రదేశంలో ఆహారం కోసం తిరుగుతూ.. శత్రువులు కనిపిస్తే రాళ్ల మధ్యలో నక్కి వాటికి దొరక్కుండా తప్పించుకుంటుంది. చూడటానికి ఎలుక రంగు, రూపంలో ఉండటంతో దీనిని ఎలుక చేపగా పిలుస్తారని, విశాఖ జిల్లా అచ్యుతాపురం మత్స్యకారులు తెలిపారు.

శ్రీవారిని ప్రముఖ సినీనటి శ్రీలీల దర్శించుకు న్నారు. ఉదయం శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఆలయం వెలుపల సినీనటి శ్రీలీల మాట్లాడు తూ.. తనకు రాబిన్‌హుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

రహదారులపై గుంతలను పూడ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ సీపీఎం నాయకులు బురదలో వినూత్న ప్రదర్శన చేశారు. సీపీఎం విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆకులు కట్టుకొని బురదలో దొర్లుతూ ప్రదర్శన చేశారు.

మయూరాల నయన మనోహర నడకలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వానలతో వాతావరణం చల్లగా మారడంతో కొండకోనల్లో విహరించే నెమళ్లు ఉల్లాసంగా తిరగాడటం ప్రారంభించాయి. కర్ణాటకలోని బెళగావి శివార్లలో కనిపించిన ఓ సుందర దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు కెమేరాలో బంధించాడిలా.. 

సాధారణంగా ఎక్కువగా నలుపురంగులో ఉన్న కాకులే కనిపిస్తాయి. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుపు రంగు కాకి దర్శనమిచ్చింది. పార్వతీపురం- శ్రీకాకుళం రహదారిలోని ఎర్రన్న గుడి కూడలిలో ఉన్న ఓ రైస్‌ మిల్లు వద్ద ఓ సిమెంట్‌ స్తంభంపై తింటూ కనిపించింది. 

ఊదా రంగులో పూలతోటను తలపిస్తూ పూత దశలో ఉన్న చిక్కుడు మొక్కలు ఇవి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడ్డిపల్లి నుంచి పార్నపల్లి వెళ్లే రహదారిలో ఓ రైతు పొలంలో చిక్కుడు మొక్కలన్నింటికీ ఒకేసారి పూత రావటంతో ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.  

వానాకాలం మొదలు కాగానే తొలకరి జల్లులు కురిశాయి. దీంతో రైతన్నలు పొలాలన్నీ దున్ని విత్తనాలు నాటారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి శివారులోని ఓ రైతు తన పొలంలో సోయా విత్తనాలు వేశారు. కురిసిన కొద్దిపాటి వానకు మొలకెత్తగా తర్వాత వర్షాలు లేకపోవడంతో బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. 

కరీంనగర్‌ జిల్లా కోతిరాంపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(పోచంపల్లి)లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. విద్యార్థుల మధ్యలో కాసేపు కూర్చొని.. బాగా చదువుకోవాలి.. ఆడుకోవాలని సూచించారు. బాలలతో సరదాగా గడిపారు. 

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home