చిత్రం చెప్పే విశేషాలు

(28-06-2024)

హైదరాబాద్‌ - విజయవాడ హైవేలోని ఆటోనగర్‌ మలుపు వద్ద సాయంత్రం సంధ్యా వేళ సూరీడు అస్తమిస్తూ కనువిందు చేశాడు. రోడ్డుకు ఎదురుగా కిందికి జారిపోతున్నట్లు కనిపించాడు. అస్తమిస్తున్న సూర్యుడ్ని సూటిగా చూసేందుకు వీలుగా పసుపు నారింజ రంగులు మేళవించుకొని అబ్బురపరిచాడు.

హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో విమానాన్ని రెస్టారెంటుగా మారుస్తున్నారు. బ్రిటన్‌ సహకారంతో తయారైన ఈ విమానం మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న బాంబర్లలో ఒకటని నిర్వాహకులు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, జానారెడ్డి, పీవీ కుమార్తె వాణిదేవి, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. పలు కాలనీల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది.

శంఖువులు సాధారణంగా ఇసుక ఉండే వాగుల్లో కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం అవి పొలంలోకి వచ్చి చేరాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి వాగు పక్కన పంట పొలంలో వందలాది చిన్న శంఖువులు చేరాయి. గత వర్షాకాలంలో శనిగరం చెరువు నిండి గుండారెడ్డిపల్లి పొలాల్లోకి పారింది.

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి జనార్దనాహిల్స్‌లో, రాయదుర్గం మెట్రో నుంచి సైబర్‌ టవర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ప్రభాస్‌ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల సందర్భంగా ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సినిమాలో ఉపయోగించిన  బుజ్జి అనే వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు.

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హయత్‌నగర్‌, బండ్లగూడ, వనస్థలిపురం, ఉప్పల్‌ , ముసాపేటలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home