చిత్రం చెప్పే విశేషాలు
(04-08-2024)
క్యూర్ ఎస్ఎమ్ఏ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 5కె 10కె ‘రన్/రైడ్ ఫర్ ఎస్‌ఎమ్‌ఏ’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో స్పైనల్ మస్కులార్ ఆట్రోఫీ (ఎస్‌ఎమ్‌ఏ) వ్యాధిపై అవగాహన కల్పించారు.
చేనేతను ప్రోత్సహిస్తూ ‘ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ’ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో శారీ వాక్ నిర్వహించారు. సుమారు 8 వేల మంది మహిళలు, విశాఖ యువతులు ఇందులో పాల్గొన్నారు. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.
హైదరాబాద్ నగరంలోని ఓ వెండి ఆభరణాల దుకాణంలో ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చింది.
ములుగు జిల్లాలో బొగత జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండ పైనుంచి ఎగిసిపడుతున్న జలపాతం నీటిధార సందర్శకులను ఆకట్టుకుంటుంది. పర్యాటకులతో పరిసరాలు కోలాహలంగా మారాయి.
విశాఖపట్నం జిల్లా చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారి మధ్య ఉండే అనుబంధాన్ని చెక్కపై తీర్చిదిద్దాడు.
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్-2024 ప్రదానోత్సవం రాయదుర్గం (జూబ్లీహిల్స్ రోడ్డు) జేఆర్సీ కన్వెన్షన్‌లో సినీ తారల తళుకుబెళుకుల మధ్య సందడిగా సాగింది. నటులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం తీరంలో మత్స్యకారులకు భారీ ఏనుగు టేకు చేప చిక్కింది. గ్రామానికి చెందిన కారే సత్తిబాబు, మైలపల్లి ఎల్లయ్య చేపల వేటకు వెళ్లగా, వారి వలకు సుమారు టన్ను బరువున్న ఈ చేప చిక్కింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ ఆడిటోరియంలో ప్రదర్శించిన శ్రీ వేంకటేశ్వర కల్యాణ నృత్యరూపకం నయనమనోహరంగా సాగింది. నిహాంత్రి 30 మంది శిష్య బృందంతో కలిసి చేసిన కూచిపూడి శాస్త్రీయ నృత్యం ఆహుతులను అలరించింది.
తమిళనాడు రాష్ట్రం చెన్నై చేట్‌పేట్‌లోని మద్రాసు క్రిస్టియన్ కళాశాల మహోన్నత పాఠశాలలో 189వ వార్షిక క్రీడాదినం సందర్భంగా 200మంది విద్యార్థులు రంగురంగుల గొడుగులతో డ్యాన్స్ చేశారు.
విజయనగరం జిల్లా ఏజెన్సీలోని కొండలు అరకును తలపించేలా మంచు సోయగంతో కనువిందు చేస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని తోట, గోరటి గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ దట్టమైన పొగ మంచు కురుస్తూ మనసును ఉల్లాసపరుస్తోంది.