చిత్రం చెప్పే విశేషాలు

(09-08-2024)

నాగార్జునసాగర్‌ డ్యాం గేట్లన్నీ ఎత్తడంతో జలదృశ్యం ఆవిష్కృతమైంది. 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు 10 గంటల తర్వాత 26 గేట్లనూ ఎత్తారు. ఆ సమయంలో 2,53,534 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2,23,256 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.

ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతోపాటు స్థానికంగా కురిసిన వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకల నీరు కూడా భారీగా చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు 2.91 లక్షల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడుదల చేశారు.

ఒడిశా రాష్ట్రం రాయగడకు సమీపంలోని నాగావళి నదిలో చేపల వేటలో ఇలా స్థానికులు నిమగ్నమయ్యారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలో నీరు చేరడంతో దుమ్మాగూడ, చెక్కగూడ, హలువ, హంస బెహరగూడ, జగన్నాథపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఇలా చేపల వేటకు నీటిలో దిగారు.

అల్లూరి సీతారామ జిల్లా సీలేరు జలాశయంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. సుమారు 15 కేజీల బరువున్న గెలాస్కోపీ రకం భారీ చేప దొరికింది. దీన్ని విక్రయించడానికి స్థానిక మార్కెట్‌కు తీసుకురాగా.. కొనుగోలు చేయడానికి స్థానికులు క్యూ కట్టారు.

నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శివాలయం వరకు నాగార్జునసాగర్‌ వెనుక జలాలు తాకడంతో పర్యాటకులు, భక్తులు ఈ అద్బుతమైన దృశ్యాన్ని చూసి పులకరించిపోతున్నారు.

రెండు రోజులుగా కురిసిన వర్షాలకు తిరుపతిలోని కపిల తీర్థం జలపాతం వర్షపు నీటితో చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది. 

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణం వంతాడపల్లి సమీపంలో ఓ పుట్ట పక్కనే ఉన్న పొడవైన మొక్కలతో సమానంగా రోజురోజుకూ పెరుగుతోంది. అటుగా వెళుతున్న వారంతా దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి హైదరాబాద్‌ నగరంలోని బర్కత్‌పురలో జాతీయ జెండాలు సిద్ధమవుతున్నాయి. గతేడాది నుంచి ఇళ్లపై కూడా మువ్వన్నెల జెండా  ఎగరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో జెండాల తయారీ మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. 

అనకాపల్లి జిల్లా రామజోగిపాలెం గ్రామానికి చెందిన వేచలపు శ్రీను రెండేళ్ల క్రితం తాడి గ్రామంలో రూ.నాలుగు వేలకు బాతును కొనుగోలు చేసి తీసుకొచ్చారు. అక్కడున్న ఓ కుక్కతో స్నేహం కుదిరింది. కోతులు బాతుపైకి దాడి చేసేందుకు వస్తే.. వాటిని కుక్క తరిమేస్తోందని శ్రీను వివరించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మామిళ్లవాయిలోని ఓ గుట్టపై నుంచి జాలువారే జలపాతమిది. వెంకటాపురం మీదుగా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే పచ్చని కొండలు, గుట్టల మధ్య నుంచి ఈ జల సందడిని తిలకించవచ్చు. 

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home