చిత్రం చెప్పే విశేషాలు
(10-08-2024)
చెన్నైకి చెందిన ఐదుగురు మహిళా చిత్రకారులు గీసిన అందమైన పెయింటింగ్స్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో కొలువుదీరాయి. తమ మదిలో మెదిలిన భావాలను చిత్రకారిణులు కాన్వాస్‌పై చూడముచ్చటగా ఆవిష్కరించిన తీరు కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఒళ్లంతా ఆకుపచ్చని రంగు.. తెల్లటి కళ్లు..ప్రకృతి అందాలతో మమేకమై ఆకట్టుకుంటున్న ఈ కీటకాన్ని పడగ గడ్డి చిలుక, ఆంగ్లంలో హుడెడ్ గ్రాస్‌హాప్పర్ అంటారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు శివారులోని ఇనుపరాతి గుట్ట అటవీ ప్రాంతంలో కనిపించింది.
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్ ఆవరణలో బహుళ అంతస్తుల భవనాలకు సమీపంలో ఫౌంటెయిన్‌ను ఏర్పాటుచేశారు. నీటిని విరజిమ్ముతున్న ఫౌంటెయిన్ విద్యార్థులు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. జలపుష్పాన్ని తలపించేలా ఉండగా, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
ఒక చక్కటి చిత్రం.. అక్షరాలతో అవసరం లేకుండానే అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చెబుతుంది. అలాంటి ప్రత్యేక ఫొటోలు సునామీ, వర్షాలు, ప్రముఖుల కన్నుమూత, క్రీడలు, పండుగలు.. ఇలా పలు సందర్భాల్లో ఈనాడు తమిళనాడులో ప్రచురితమయ్యాయి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఏర్పాటుచేశారు. మామిడాకులు, పూలతో పందిరిని అందంగా అలంకరించారు. వరికంకులను కుచ్చులుగా కట్టారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాక ఘాట్ రహదారిలో ప్రకృతి అందాలు ప్రజలు, ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. పర్వతాలపై మబ్బులు పరుచుకుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించింది. ఈ సన్నివేశాలు చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపారు.
తిరుచ్చి జిల్లాలోని తురైయూరు పట్టణ సమీపంలో ఉన్న పులియాంచోలై జలపాతంలోని రిజర్వ్ అటవీ ప్రాంతం, కొల్లిహిల్స్‌లోని ఆగాయగంగై(ఆకాశగంగ) ప్రదేశాలు తిలకించవచ్చు. ఆ తర్వాత పర్యాటకులు తిరుచ్చిలోని హోటల్ తమిళనాడుకు తిరిగొస్తారు.
ఇన్నాళ్లూ కంప చెట్లతో అడవిని తలపించిన అమరావతి.. కూటమి ప్రభుత్వం వచ్చాక కనులవిందు చేస్తోంది. పిచ్చి మొక్కలు కమ్మేసిన రోడ్లు నేడు విద్యుల్లతల్లా మెరిసిపోతున్నాయి. ఐదేళ్ల వనవాసం నుంచి బయటపడిన రాజధాని ఇప్పుడిప్పుడే రాజసం ఉట్టిపడేలా ముస్తాబవుతోంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ నంబరు జాతీయ రహదారి ఈ అడవుల గుండానే వెళ్తుంది. ఈ దారిలో ప్రయాణం ఉల్లాసవంతం... ఆహ్లాదభరితం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ వద్ద తీసిన ఈ చిత్రం పచ్చందాలు జాతీయ రహదారిని మణిహారంగా మార్చుకున్న చందాన ముచ్చటగొలుపుతోంది.