చిత్రం చెప్పే విశేషాలు

(11-08-2024)

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పురీ తీరంలో ప్రధాని మోదీ చిత్రంతోపాటు హర్ ఘర్ తిరంగా సందేశాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. పలువురు పర్యాటకులు ఆ సైకత శిల్పం వద్ద ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

తెలుగు అక్షర దీపిక ‘ఈనాడు’ దినపత్రిక స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లాలోని గాజువాక శ్రీసూర్యతేజ్‌ పాఠశాల విద్యార్థులు ‘ఈనాడు-50’ పేరిట చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది.

ఏలూరు కలెక్టరేట్‌లో పెలికాన్‌ పక్షులున్నాయేమిటనుకుంటున్నారా.. మీరు చూస్తున్నవి నిజమైన పక్షులు కావు. అచ్చంగా మన కళ్లకు కట్టేలా కృత్రిమ బొమ్మలతో ఏర్పాటుచేసిన ప్రదర్శనలోని చిత్రాలివి. కలెక్టరేట్‌కు వచ్చేవారు వీటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

సాధారణంగా పావురాలు తెల్లగా, నల్లగా, బూడిద రంగుల్లో ఉంటాయి. విభిన్నంగా ఉన్న ఈ పచ్చని పావురాలు మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో గుంపుగా ఎగురుతూ ‘ఈనాడు’ కెమెరాకు చిక్కాయి. 

ఎత్తైన కొండలు, పచ్చటి పంట పొలాల మధ్య ఓ చిత్ర కళాకారుడు గీసిన తెల్లటి గీతలా కనిపిస్తున్న ఆ దారి.. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి కంబాలపల్లి వెళ్లే రోడ్డు. నల్లమల అడవి ప్రాంతంలో చుట్టూ పచ్చని గుట్టల మధ్య ఈ దారిలో ప్రయాణం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

పొలాలు స్థిరాస్తికి నిలయాలుగా మారడంతో పాటు రైతుల పంటల అభిరుచి మారిపోవడంతో పక్షులకు ఆవాసాలు లేకుండా పోయాయి. మేడ్చల్‌ జిల్లా పోచారం పురపాలిక సంఘం సంస్కృతిటౌన్‌ షిప్‌లోని చెట్ల కొమ్మలకు పిచ్చుకల గూళ్లు ఆకట్టుకుంటున్నాయి.

 ఈనెల నిర్వహించనున్న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో భాగంగా యూత్‌ ఫొటోగ్రఫిక్‌ సొసైటీ సభ్యులు తీసిన ఫొటోలను బెంగళూరు (శివాజీనగర) చిత్రకళా పరిషత్తులో ప్రదర్శనకు ఉంచారు. దేశంలో అత్యంత పాత సొసైటీల్లో ఒకటిగా 53 ఏళ్ల కిందట ఈ సంస్థ ప్రారంభమైంది. 

వరంగల్‌ నగరానికి చెందిన దేవరాయి రమేశ్‌ అనే పాఠకుడు స్వతహా చిత్ర కళ(డ్రాయింగ్‌) ఉపాధ్యాయుడు. తన అభిమాన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ రావి ఆకుపై ఈనాడు లోగోతోపాటు, సంస్థ ఛైర్మన్‌ దివంగత రామోజీరావు, ఆయన కుమారుడు దివంగత సుమన్‌ కళాకృతులను రూపొందించారు. 

ప్రతికూల పరిస్థితులను తట్టుకుని చిగురిస్తూ.. ఎదిగే తురాయి చెట్టు పల్నాడు జిల్లా బెల్లంకొండ సమీపంలోని పొలాల్లో కనువిందు చేస్తోంది. చెట్టంతా పూల సోయగంతో ఆకట్టుకుంటోంది. రైతులు దాని కింద సేద తీరుతున్నారు. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

ఖమ్మం శివారు రఘునాథపాలెం రోడ్డు వెంట సుడా పార్కు సమీపంలోని ఈప్రాంతం అచ్చం చెరువులా కనిపిస్తోంది. కానీ ఇక్కడ మల్చింగ్‌ విధానం ద్వారా బొప్పాయి పంట సాగవుతోంది. మల్చింగ్‌ కవర్ల అమరిక చెరువును తలపిస్తోంది. 

కృష్ణా తీరంలో ఉన్న నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అచ్చంపేట శివారులోని శివాలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో జింకలు చెంగుచెంగున దూకుతూ ఇలా కనువిందు చేశాయి.

వినాయక చవితి పర్వదినం.. కొలువుదీరిన బొజ్జగణపయ్య!

మీ జీవితం విలువను గుర్తించండి

చిత్రం చెప్పే విశేషాలు (06-09-2024)

Eenadu.net Home