చిత్రం చెప్పే విశేషాలు

(14-08-2024)

తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చారిత్రక గోల్కొండ కోటలో చురుగ్గా సాగుతున్నాయి. కోటను విద్యుత్‌ వెలుగులతో త్రివర్ణ కాంతులీనేలా అలంకరించారు. మువ్వన్నెల కాంతుల సొబగులతో గోల్కొండ కోట చూపరులను ఆకట్టుకుంటోంది. 

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగరను పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరుల శాఖ విడుదల చేసింది. తాజాగా నీటి గలగలలతో.. చుట్టూ అటవీ పచ్చదనంతో ఆ ప్రాంతం కనువిందుగా మారింది. 

చుట్టూ నల్లటి గిరులు..మధ్యలో లోగిళ్లు.. రాత్రి సమయంలో విద్యుత్తు దీపాల కాంతులతో మెరిసి పోతున్న నీలగిరి అందం.. ఆకాశంలో చుక్కల్లా చమక్కుమంటున్న దీపాలకు తలుక్కుమంటున్న నల్గొండ దారులు. లతీబ్‌సాహేబ్‌గుట్టపై దీవిటీల మాదిరిగా ఆకాశదీపాలు కనువిందు చేశాయి.

ఓవైపు కొబ్బరిచెట్లు మరోవైపు పచ్చని పొలాలతో కోనసీమను తలపిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామం. కృష్ణానదిలో ప్రవాహం ఉండటం, జూరాల కాల్వలకు నీటిని వదులుతుండటంతో వరిచేలు పచ్చదనంతో నిండుగా ఇలా కన్పిస్తున్నాయి. 

స్వాతంత్య్రదినోత్సవం పురస్కరించుకొని పల్నాడు జిల్లాలో పులిచింతల జలాశయం వర్ణ రంజితమైంది. విద్యుత్తు కాంతులతో రాత్రి వేళ సందర్శకులకు కనువిందు చేస్తోంది. 

టెక్సాస్‌లో తీసిన ఫొటోను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తన ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్టు చేశారు.

అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు అమెరికాలో మన దేశభక్తి చాటాడు. అఖిల్‌ వేల అడుగుల ఎత్తుకు స్కైడ్రైవింగ్‌ చేస్తూ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఒకవైపు గాలిలో పయనిస్తూనే జాతీయజెండాను ప్రదర్శించడం విశేషం.   

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

స్థానిక పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నుంచి ప్రధాన రహదారి మీదుగా గాంధీనగర్ వరకు జాతీయ జెండాలను చేత బోని ర్యాలీలో భాజపా నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

మట్టి గణనాథుడి ప్రతిమలను సహజ రంగులతో అలంకరించడం హైదరాబాద్‌.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకత. దానిమ్మ పండు తొక్కలు, బంతి, మోదుగ పూలు, చెట్టు బెరడు నుంచి రంగులు తయారు చేసి ప్రతిమలకు అద్దుతున్నారు. 

కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజు త్రివర్ణ పతాక రంగులతో మెరిసిపోతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని పురావస్తు శాఖ అధికారులు విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరవాసులు, పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.   

ఎన్ని పైవంతెనలు.. అండర్‌పాస్‌లు నిర్మించినా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గడం లేదు. ఎన్టీఆర్‌ మార్గ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకొని వాహనదారులు నరకం చవిచూశారు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home