చిత్రం చెప్పే విశేషాలు

(16-08-2024)

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకలో శ్రీముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.20 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. 

హైదరాబాద్‌ నగరం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘‘ఎవ్రి డే ఇండియా’’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో శ్రామిక శక్తుల చిత్రరూపం ఆకట్టుకుంది.  

మంత్రి నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు.

ఇది ఇంగ్లాండ్‌కు చెందిన 1936 మోడల్‌ కారు. నిజాం కాలంలో హెచ్‌వైడీ అని నంబర్‌ ప్లేట్‌ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక ఏపీవై పేరుతో వచ్చిన మొదటి కారు ఇదే.

దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న కొండపల్లి, నిర్మల్‌ బొమ్మలంటే అందరికీ ఇష్టమే. అచ్చం వాటిలా కనిపించేలా బొమ్మలను హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ కేబీఆర్‌ పార్కు కూడలిలో ఏర్పాటు చేస్తున్నారు. 

హైదరాబాద్‌లోని సిటీబస్టాండ్‌ సమీపంలో కొలువుదీరిన అభయాంజనేయస్వామికి మూడు రంగుల్లో ఉన్న తమలపాకులతో అలంకరించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని చెరువులవెనం, లంబసింగి, తాజంగి పర్యటక ప్రాంతాలు కళకళలాడాయి. వరుస సెలవులతో దూరప్రాంతాల నుంచి పర్యాటకులు మన్యానికి తరలివచ్చారు. ఇక్కడ మంచు అందాలను ఆస్వాదించారు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రుల కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారు త్రివర్ణ పతాకం చీరలో దర్శనమిచ్చారు.

స్వాతంత్య్ర దినోత్సవం వేళ విశాఖకు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైకిల్‌కు మువ్వన్నెల జెండాలు కట్టుకొని యాత్ర చేపట్టారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పరిసరాల్లో గత రెండు రోజులుగా దట్టంగా పొగమంచు కురుస్తోంది. వాహన చోదకులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు. మంచు అందాలను తిలకించేందుకు భారీ ఎత్తున పర్యాటకులు మన్యానికి వస్తున్నారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home