చిత్రం చెప్పే విశేషాలు

(17-08-2024)

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌ యార్డు రైతులు వేరుసెనగను మార్కెట్‌కు తెచ్చారు. తూకం వేయడమే మిగిలింది. భోజనం చేసొద్దామని మార్కెట్‌ నుంచి కాలు బయటపెట్టారు. అంతే, వరుణుడు ప్రతాపం చూపాడు. వేరుసెనగ రాశులపై టార్పాలిన్లు కప్పే వీల్లేకుండా ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. 

వైద్యులకు రక్షణ లేదంటూ దేశ పటంతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో విద్యార్థుల వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది.. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది.. శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది.. ఈ సమయంలో ‘జల’ప్రయాణం ప్రమాదకరం.. దీన్ని దృష్టిలో పెట్టుకొని నదిలో పడవ(బోట్లు) ప్రయాణాన్ని నిషేధించారు.

శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున మంచుతెరలు భక్తులను ఆకట్టుకున్నాయి. పొగమంచు కప్పేసిన ఆలయం విద్యుత్‌ కాంతిలో ఇల వైకుంఠాన్ని  తలపిస్తోంది. అదే సమయంలో భక్తులు చలి తీవ్రతకు ఇబ్బందిపడుతున్నారు. ఈ విచిత్రమైన వాతావరణం భక్తులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నంద్యాల జిల్లా నందికొట్కూరులోని చౌడేశ్వరి ఆలయంలో కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శ్రావణమాసం పురస్కరించుకుని ఉదయం గాజులతో, సాయంత్రం నోట్లతో తీర్చిదిద్దారు. 

ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం (భంజవిహార్‌) సాగర అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొన్నారు. 13 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ జీవికి 13 జతల కాళ్లు, ఆహారం తీసుకోవడానికి ముందు భాగం దిగువ మరో రెండు కాళ్లు మాదిరిగా వేలాడుతున్నాయి.

ఈ చిత్రం చూశారా.. వైరా బస్టాండ్‌లో ఓ చెట్టుకు దూరం నుంచి చెదలు పట్టి గీతలు పడినట్లుగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూస్తే కొమ్మకు పురుగుల గుంపుగా ఇలా అతుక్కుని ఉన్నాయి. వింతగా ఉన్న ఆ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

హైదరాబాద్‌ నగరంలోని మొఘల్‌పుర ఉర్దూఘర్‌లో ఏర్పాటు చేసిన అరుదైన పురాతన నాణేలు, కరెన్సీ, స్టాంపు పేపర్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. 

హైదరాబాద్‌ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్‌. ఆకర్షణీయ నగరంగా మార్చే క్రమంలో బాలసముద్రం కూడలిలో వరంగల్‌ మహా నగర పాలక సంస్థ మొదటిసారి ఇనుముతో తయారు చేసిన 30 అడుగుల ఈఫిల్‌ టవర్‌ నమూనా ఏర్పాటు చేసింది. 

ఏలూరు ఆర్‌ఆర్‌పేటకు చెందిన కుమార్‌కు మొక్కలంటే ప్రాణం. ఇంటిపై భాగంలో కుండీలను ఏర్పాటుచేసి అందులో డ్రాగన్‌ మొక్కలను పెంచుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పోషకాలను అందిస్తున్నారు. మొక్కలకు కాసిన డ్రాగన్‌ పండ్లను ఆ మార్గంలో వెళ్లేవారంతా ఆసక్తిగా చూస్తున్నారు

వినాయక చవితి పర్వదినం.. కొలువుదీరిన బొజ్జగణపయ్య!

మీ జీవితం విలువను గుర్తించండి

చిత్రం చెప్పే విశేషాలు (06-09-2024)

Eenadu.net Home