చిత్రం చెప్పే విశేషాలు

(18-08-2024)

మహిళలకు కొరవడిన రక్షణను కళ్లకు కట్టేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కొండాయిగూడెంకు చెందిన బీటెక్‌ విద్యార్థిని దాచేపల్లి ఉదయశ్రీ పెన్సిల్‌ ఆర్ట్‌ వేశారు. స్త్రీలపై దాడులను అరికట్టాలని.. రక్షణ కల్పించాలనే సందేశాన్నిస్తున్న ఈ చిత్రం కదిలించేలా చేస్తోంది.  

నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలో కొమ్మలకు వేలాడుతున్న గిజిగాడి గూళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మంచినీళ్లబావి గ్రామంలో తుమ్మ చెట్టుకు గిజిగాడు గూళ్లు అల్లుకున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ అనిపించింది.

సినీనటి సంయుక్త మేనన్‌ హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. పంజాగుట్టలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చీరకట్టుపై డిజైనర్‌ ఆభరణాలతో తళుక్కున మెరిశారు. 

నల్లమల అడవి చుట్టూ పచ్చటి కొండలు. వాటి మధ్య సారవంతమైన భూములు. ఆ ఎర్రటి నేలలో తెల్ల బంగారం పంట సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి పత్తి పైరు ఏపుగా పెరిగింది. పచ్చగా కంటికి ఇంపుగా కనిపిస్తున్న ఈ దృశ్యం నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్ట శివారులోనిది. 

నల్గొండ జిల్లా దేవరకొండలోని వైజాగ్‌ కాలనీలో కృష్ణమ్మ జలకళ ఉట్టిపడుతోంది. చుట్టూ పచ్చని కొండల మధ్య.. మిలమిల మెరిసే కృష్ణానదీ అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులు కోసం స్థానికులు పడవలను సిద్ధం చేశారు. 

హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో ఎగసిపడుతున్న ఫౌంటెయిన్‌ నీటి ధారకు జాతీయ జెండాను ఎగరేసినట్లుగా కనిపిస్తూ ఇలా కనువిందు చేస్తోంది.

తాజా ఆకులా పచ్చగా మెరుస్తున్న ఈ అరుదైన గొంగళిపురుగు కేవలం మామిడి చెట్లనే ఆశ్రయిస్తుంది. దీని శాస్త్రీయ నామం యుథాలియా అకోంథియా గుర్డా బారన్‌. కాకినాడ కలెక్టరేట్‌లో ఈ జీవి ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. 

అనకాపల్లి జిల్లా కోనాం పంచాయతీ శివారు కొత్తవీధికి చెందిన గిరిజనుడు గేమ్మెలి చంటి సమీపంలోని అటవీ ప్రాంతంలో అరుదైన కీటకాన్ని గుర్తించాడు. దీన్ని గ్రామానికి తీసుకొచ్చాడు. దీన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. దీన్ని స్టాగ్‌ బీటిల్‌ కీటకంగా పిలుస్తారని స్థానికులు తెలిపారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home