చిత్రం చెప్పే విశేషాలు

(21-08-2024)

శ్రావణ పూర్ణిమ సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని కైలాసగిరులపై కొలువుదీరిన శివపార్వతులు చంద్రబింబ కాంతుల్లో మరింత అందంగా భక్తులకు దర్శనమిచ్చారు.

 గద్వాల జిల్లా రాజోలి శివారులోని తుంగభద్ర నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు బలరాముడు వేసి వలకు 12 కేజీల పొందుగ చేప చిక్కింది. ఈ చేపను మార్కెట్లో రూ.2,500లకు మత్స్యకారుడు విక్రయించగా, కొన్న వ్యక్తి రూ.4 వేలకు వేరొకరికి విక్రయించాడు.

మహబూబాబాద్‌ జిల్లా మానుకోట సహా పరిసర పల్లెల్లో తాను తయారు చేసిన లాంతర్లను విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఫిరోజ్‌ఖాన్‌ను న్యూస్‌టుడే కెమెరా క్లిక్‌మనిపించింది.

విజయవాడ నగరంలోని స్టెల్లా ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ చేనేత ప్రదర్శన ముగింపు వేడుకలు పురస్కరించుకొని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో నిర్వహించగా.. చూపరులకు కనువిందు చేసింది. 

ఇంటి నిర్మాణంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి.. ఇక్కడ కనిపిస్తున్న ఇంటిపై కారు చిత్రం ఈ కోవకు చెందిందే. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సాహిల్‌ హమీద్‌ అనే వ్యక్తి తన ఇంటిపై సిమెంటుతో నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. 

ఇస్కాన్‌ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం గౌతమి ఘాట్‌లోని ఇస్కాన్‌ మందిరాన్ని విద్యుద్దీపాలతో ఇలా సుందరంగా అలంకరించారు.

తల్లి ప్రేమకు సాటేదీ లేదని నిరూపిస్తోంది ఈ బుల్లి పిట్ట. ఓ చొప్ప కర్ర ఆసరాగా చిన్న గూడు కట్టి అందులో నాలుగు పిల్లలను పెట్టింది. వాటికి ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ దృశ్యం మహబూబ్‌నగర్‌ జిల్లాలో కనిపించింది.

ములుగు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మామిడి ఆకులు, గులాబీ పూలతో ఎకో ఫ్రెండ్లీ రాఖీలను తయారు చేశారు. పలువురికి కట్టి వారి అనుబంధాన్ని చాటుకున్నారు. 

ఇది ఇంద్రవెల్లి మండలం వడ్‌గాంవాగు. చిన్నపాటి వర్షం కురిసినా వాగు పొంగుతుంది. మామడిగూడ(జి), మామిడిగూడ(బి) గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇదే వాగును జైత్రంతండా, జెండగూడ గ్రామస్థులు దాటాల్సి ఉంటుంది. వానొస్తే వారు సాహసం చేసి వాగు దాటాల్సిందే. 

వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఇల్లు కట్టే సమయంలో పెంచిన కొబ్బరి చెట్టును తొలగించకుండా దాని చుట్టూ నిర్మాణం పూర్తి చేశారు. అది 30 అడుగులకు పెరిగి ఇంటికే అందం తెచ్చి చూపరులను ఆకట్టుకుంటోంది. 

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home