చిత్రం చెప్పే విశేషాలు

(23-08-2024)

భారత ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక కాలమానం ప్రకారం 7.30 గంటలకు ఉక్రెయిన్‌లోకి అడుగుపెట్టారు. కీవ్‌లోని భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్‌ వద్ద మోదీకి భారత పతాకాలతో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లోని ఇస్కాన్‌ బృంద సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు.

చంద్రుడిపైకి చంద్రయాన్‌-3 విజయవంతంగా చేరిన సందర్భంగా మొదటిసారి ఈ రోజు జరుపుకొనే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు ఆకొండి అంజి గీసిన చిత్రం ఆకట్టుకుంటోంది.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురం వద్ద ఊకచెట్టు వాగు సమీపంలో శ్రీభ్రమరాంబ సమేత రామేశ్వరాలయం పక్కనే కృష్ణమ్మ ప్రహిస్తోంది. నాలుగేళ్ల క్రితం వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మించారు. ఆలయ నిర్వాహకులు చెక్‌ డ్యామ్‌లో 36 అడుగుల భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

జనగామలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీ వేసిన ఈ చిత్రంలోని వ్యాఖ్యలు చక్కటి సందేశాన్ని ఇస్తున్నాయి. అందమైన ప్రకృతి దేవుడిచ్చిన స్వర్గమని, అలసత్వంతో చేసుకోవద్దు నరకం అనే చక్కటి అర్థం ఈ చిత్రంలో దాగుంది.

శ్రీకృష్ణాష్టమి పుణ్య గడువు సమీపిస్తోంది. నివాసాలు, మండపాల్లో చిన్నికృష్ణుడిని కొలువుదీర్చడానికి భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. పండగ కోసం బెంగళూరు నగరంలోని గాంధీబజార్‌లో చిన్ని కృష్ణుల విగ్రహాలను విక్రయానికి సిద్ధం చేశారు.

ప్రకాశం జిల్లా వెలిగొండలో కురిసిన వర్షపు ధార చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాయంత్రం వెలిగొండలోని దుర్గంపై కుండపోతగా ఒకే ప్రాంతంలో వర్షపుధార కురిసింది. పట్టణ పరిధి వరకు ఈ ధార స్పష్టంగా కనిపించింది.

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది వ్యవసాయ వృత్తి విద్య కోర్సు ప్రారంభించారు. అందులో భాగంగా 9, 10, ప్లస్‌ టు విద్యార్థులు గ్రామానికి చెందిన ఏ.ఉదయశంకర్‌ అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో నారు పీకి, నాటు వేశారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లిలో ఓ కొత్త జంట వివాహ ఊరేగింపు వినూత్నంగా జరిగింది. వరికోత యంత్రానికి వధూవరులు కూర్చునేలా కుర్చీ తయారు చేయించారు. ఇది అందరినీ ఆకట్టుకుంది.

ఆదిలాబాద్‌ నుంచి ఖండాల ఘాట్ మీదుగా వెళ్లే పర్యాటకులను ఆకర్షించే చెరువు ఇది. దూరం నుంచి చూడముచ్చటగా కొండల మధ్య కనిపిస్తూ కనువిందు చేస్తోంది. 

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

Eenadu.net Home