చిత్రం చెప్పే విశేషాలు

(25-08-2024)

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పశ్చిమబెంగాల్‌లోని నదియాలో బాలకృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని నాచారం చెరువు ఆహ్లాదకర వాతావరణానికి చిరునామాగా మారింది. కట్టపై నుంచి ఓ వైపు చూస్తే... కనుచూపుమేర పచ్చటి పొలాలు.. మరో వైపు చెరువునీటిలో చెట్లకు నిండుగా పిచ్చుకగూళ్లు కొద్ది దూరంలో గుట్టలు ఆకర్షణగా కనిపిస్తున్నాయి. 

ఇసుక తిన్నెలపై ఎగిరి.. చల్లగాలులు ఆస్వాదిస్తూ.. సాగర జలాల్లో ఆడాలని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు చాలా మంది వెళ్తుంటారు. తీరా వెళ్లాక.. ఎగసిపడుతున్న అలలు చూసి వెనకడుగు వేస్తారు. అలాంటి ఇబ్బందేం లేకుండా ఆ సముద్రుడే సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్లాడు.

వారం రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు, మూగజీవాలు సైతం ఇక్కట్లు పడుతున్నాయి. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కార్యాలయం వద్ద ఉన్న కుళాయిలో నీరు తాగేందుకు ఓ వానరం పడుతున్న పాట్లను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

గత నెలలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ డ్యాం డెడ్‌ స్టోరేజీకి చేరువ కావడంతో సాగర్‌లో ఎండిపోయిన చెట్లు, రాళ్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఈ నెలలో ఎగువ ప్రాంతంలో పడిన వర్షాలకు శ్రీశైలం డ్యాం నిండి.. గేట్లు ఎత్తడంతో సాగర్‌ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం సంతరించుకుంది.

మహబూబ్‌నగర్‌లో పసుపు రంగు రెక్కల సీతాకోకచిలుకలు గుంపుగా వాలి కనువిందు చేస్తున్నాయి. వీటిని కామన్‌ ఎమిగ్రెంట్‌ సీతాకోకచిలుకలు అంటారు. భూమి లోపల లభించే ఖనిజాలు, పోషకాల కోసం ఇవి నేలపై వాలుతుంటాయి. 

మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లాలోని తాడోబా అభయారణ్యంలోని ఓ చెరువులో పెద్ద పులి తన పిల్లలతో సందడి చేసింది. మధ్యచాందా అటవీ క్షేత్రంలోని కోర్‌జోన్‌లో టీ-20 అనే పులి తన నాలుగు పిల్లలతో సమీప చెరువులో కాసేపు జలకాలాడి సేదదీరింది. 

 హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రిపిక శివరాజ్‌ భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించాడు. అంతుబట్టని విషజ్వరం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతేడాది ఆగస్టు 8న మరణించింది.

‘తనకు కొత్త అయిన గేమ్‌లో భారత మిస్టర్‌ 360 వద్ద టెక్నిక్స్‌ నేర్చుకుంటున్నా.. ’ అంటూ సూర్యకుమార్ యాదవ్‌ను కలిసిన సందర్భంగా మను బాకర్ ఎక్స్‌(ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

Eenadu.net Home