చిత్రం చెప్పే విశేషాలు

(29-08-2024)

పారిస్‌ వేదికగా పారాలింపిక్స్‌ 2024 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 

ఈత చెట్టుకు గిజిగాడు గూళ్లకు ప్రకృతి రమణీయత తోడై ఆహ్లాదం పంచుతోంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం చవిటి చెరువు దగ్గర ఉన్న ఈత చెట్టు మట్టల చివరన గిజిగాడు గూళ్లు అల్లుకున్నాయి. 

తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌ జిల్లా భవాని సమీపంలోని ఊరాట్చికోట్టై కొండ ప్రాంతం మేఘావృతమైంది. ఆ సమయంలో మేఘాలు ఎర్రని శివ లింగాకారంలో దర్శనమిచ్చాయి. దీన్ని చూసిన పలువురు ప్రజలు భక్తి పరవశులయ్యారు. 

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి (పీఏపల్లి) మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరదతో నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. పచ్చని అందాల నడుమ నీలిరంగులో ఆకట్టుకుంటోంది. 

అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కొబ్బరితో తయారు చేసిన పలు రకాల బొమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  

బ్రాండ్‌ బెంగళూరు పనులన్నీ ప్రస్తుతం సుందరీకరణ దిశగానే సాగుతున్నాయి. నగర నడిబొడ్డున రేస్‌కోర్సు మార్గ కూడలిని ఇదిగో.. ఇలా పాదచారుల విశ్రాంతి కేంద్రంగా మార్చారు. ఇటీవలే పనులన్నీ పూర్తి చేశారు. ప్రారంభానికి తీర్చిదిద్దారు. 

గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకొంటున్న క్రమంలో ఆయన చిత్రాన్ని అక్షరాలతో ఆవిష్కరించారు గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు పణిదెపు వెంకటకృష్ణ. 

వినాయక చవితి పర్వదినం.. కొలువుదీరిన బొజ్జగణపయ్య!

మీ జీవితం విలువను గుర్తించండి

చిత్రం చెప్పే విశేషాలు (06-09-2024)

Eenadu.net Home