చిత్రం చెప్పే విశేషాలు

(30-08-2024)

 ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్‌ గణనాథుడు పాతబస్తీ మీదుగా గురువారం సాయంత్రం మండపానికి చేరుకున్నారు. వచ్చే నెల 7 నుంచి గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధూల్‌పేట్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ వినాయకుడిని వాహనంలో బాలాపూర్‌కు తరలించారు. 

ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్‌ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. జలదృశ్యాలను చరవాణుల్లో బంధిస్తున్నారు. 

రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి విశాఖ జిల్లా సింహాచలం పరిసర ప్రాంతాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో గోశాల కూడలి వద్ద ఉన్న లోహ విహంగం సింహగిరిని చుట్టుకున్న మేఘాల్లోకి ఎగిరిపోతున్నట్లుగా చూపరులను కనువిందు చేసింది. 

చుట్టూ పంట పొలాలు.. నీటి వనరులు.. వర్షాలతో పచ్చదనాన్ని పరచుకున్న గుట్టలు.. మధ్యలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయం.. కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలం గోపాల్‌రావుపేట గ్రామ సౌందర్యమిది. ధర్మారంలోని అయ్యప్పస్వామి గుట్టపైకి వచ్చే భక్తులకు గ్రామాల పరిసరాలు ఇలా కనువిందు చేశాయి.  

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని స్థానిక పాదగయ క్షేత్రంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమయ్యాయి. పూజల్లో పాల్గొనే ఆడపడుచులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చీరలు, పూజా సామగ్రి ఉచితంగా సమకూర్చారు. అనంతరం వరలక్ష్మీ వ్రతమాచరించారు.

హైదరాబాద్‌ నగరంలోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఆటలపై మక్కువ పెంచేందుకు ఏర్పాటు చేసిన టెన్నిస్‌ క్రీడాకారిణి శిల్పం విరిగిపోయింది అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. 

ఆకుపచ్చ జామకాయలు చూశాం.. లోపల గులాబి రంగులో ఉండేవీ తిన్నాం.. ఇదిగో ఇది మాత్రం నల్లని జామకాయ. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళాలో ఇది ఆకర్షిస్తోంది. చిన్న పొదలా.. నాలుగు నుంచి పది అడుగుల ఎత్తు పెరిగే ఈ నల్ల జామకు కాండం సన్నగా ఉంటుంది.

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

Eenadu.net Home