చిత్రం చెప్పే విశేషాలు

(31-8-2024)

భారతీయ వాయుసేన కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో నిర్వహించిన ఎయిర్‌షోకు స్థానికుల నుంచి చక్కని స్పందన లభించింది. సూర్య కిరణ్‌ విమానాలు గాల్లోకి వివిధ రంగుల పొగను చిమ్ముకుంటూ చక్కర్లు కొట్టాయి. బీదర్‌ కోట ఆవరణ నుంచి పిల్లలు, పెద్దలతో పాటు స్థానికులు ఈ విన్యాసాలను వీక్షించారు. 

కథానాయకులు జూ.ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టిలు బెంగళూరు విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇద్దరూ షూటింగ్‌ల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్తూ అనుకోకుండా ఎదురుపడ్డారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’తో, రిషబ్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఒంగోలు హైదరీ క్లబ్‌ ఉపాధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. ప్రస్తుతం ఆయన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. బాల్యం నుంచే ఒంగోలు గిత్తలపై మక్కువ పెంచుకున్నారు. దీంతో బండి లాగుతున్న ఒంగోలు ఎడ్ల జత ప్రతిమలను కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ఓ ప్రముఖ శిల్పితో చేయించారు.

తెల్లటి పాలపొంగులా కొండల మాటున దాగి, వాటిని కప్పేస్తూ అబ్బుర పరుస్తున్న నీలి మేఘాల సుందర దృశ్యం ఆకట్టుకుంటోంది. ఈ దృశ్యం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామం జేఎన్‌టీయూ కళాశాల వద్ద ‘ఈనాడు’ కంటపడింది.

ఎగువన వర్షాలు పడుతున్న నేపథ్యంలో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎత్తడంతో... ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం అధికమైంది. నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని కిందికి విడిచిపెట్టారు. 

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌లో సీతాకోకచిలుక థీమ్‌పార్క్‌లో భారీ బొమ్మను ఏర్పాటు చేశారు. ఇది సందర్శకులను కట్టిపడేస్తోంది. 

విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట రహదారి మార్గంలోని తెదేపా కార్యాలయం వద్ద వరద నీటిలో వాహనాలు మునిగాయి.

తిరుమల శ్రీవారి ఆలయంపై మేఘాలు నీలివర్ణంలో కమ్ముకుని కనువిందు చేశాయి. పరిసరాలు శోభను సంతరించుకున్నాయి. కొంతసేపటికి జల్లులు పడటంతో భక్తులు సేదతీరారు.

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home