చిత్రం చెప్పే విశేషాలు

(-02-09-2024)

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరంగల్‌ జిల్లా ఉర్సు రంగసముద్రం మత్తడి వద్ద సుమారు 60-70 మంది చేపలు పట్టేందుకు పోటీపడ్డారు. ఉర్సుకు చెందిన మత్స్యకారుడు బైరి రమేష్‌కు 12 కిలోల పెద్ద చేప దొరికింది. భారీ చేపతో స్వీయ చిత్రం తీసుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు.

కర్ణాటక రాష్ట్రం కొప్పళ ఛాయాచిత్ర గ్రాహకుడు భరత్‌ కుందకూర తీసిన చిత్రానికి జాతీయ స్థాయిలో స్వర్ణపతకం లభించింది.

 హనుమ దీక్ష విరమణకు సూర్యోదయ వేళ అంజనాద్రి కొండ పైకి వెళుతున్న మాలధారుల చిత్రానికి పతకం అందుకున్నారు

ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పిచ్చుకలు అందమైన గూళ్లు నిర్మించుకొని నివాసం ఏర్పరచుకున్నాయి.చిన్నారి పిచ్చుకలతో కలిసి సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం  ఎక్కడెక్కడో తిరిగి చిన్నారులకు అందిస్తున్నాయి. 

తిరుపతి జిల్లా కోట మండలం శ్రీనివాససత్రం సమీపంలోని సముద్ర తీరంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన మంచాలసనత్‌కుమార్‌ సైకతశిల్పాన్ని హ్యాపీబర్త్‌డే అనే క్యాప్షన్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు.

తిరుపతి జిల్లా వినాయక్‌ సాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ వినాయకుని ప్రతిమ వద్ద డ్యాన్స్‌ చేస్తున్న వీరు ఓ ఇన్‌స్టిట్యూట్‌ కళాకారులు. వినాయక చవితి పర్వదినం కోసం ఇక్కడ సాధన చేశారు. 

పచ్చని కొండపై చక్కగా ఒదిగినట్లున్న ఈ గృహాలు కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఆరిలోవలోని తోటగరువుకొండపై జీవనం సాగిస్తున్న బీఎన్‌ఆర్‌ కాలనీ వాసులవి.

ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కురిసిన వర్షంతో జలపాతానికి భారీగా వరద చేరుతుండటంతో.. ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. పర్యటకులు నిల్చుని అందాలను వీక్షించే రాతికట్టను ప్రవాహం తాకుతోంది.

భారీ వర్షాలకు వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల ప్రాజెక్టు మత్తడి దూకుతోంది. నిండుకుండలా ఉన్న సరస్సులో చిలుకలగుట్ట ప్రతిబింబం ఆకట్టుకుంటోంది. పర్యాటకులు కట్టపై నుంచి ఆ సుందర దృశ్యాన్ని చూసి ముగ్దులవుతున్నారు. చరవాణుల్లో చిత్రాలు దిగి మురిసిపోయారు.

 శ్రావణమాసం పురస్కరించుకుని నల్గొండ జిల్లాలోని భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అష్టలక్ష్మీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారికి లక్ష కమల పుష్పార్చన నిర్వహించారు.

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home