చిత్రం చెప్పే విశేషాలు

(03-09-2024/1)

సీతంపేట మండలంలో ఉన్న ఆడలి వ్యూ పాయింట్‌ పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఇక్కడికి వచ్చేవారికి ప్రకృతి రమణీయత అందాలు, చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, కొండలు అబ్బురుపరుస్తున్నాయి.

వరద బాధితులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రూ. కోటి విరాళం అందించారు. చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. 

నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో తెలుగు గంగ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చుటుపక్కల పంటపొలాలను పూర్తిగా ముంచెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కృష్ణా వరద ఉద్ధృతి నెమ్మదించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువ ప్రాంతాల్లో వరద తగ్గుతోంది.

ఖమ్మం, మహబూబాబాద్‌ వరద ప్రభావిత ప్రాంతాను సీఎం రేవంత్‌ పరిశీలించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. 

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మంగళవారం ‘ఎఫ్‌పీవో కన్‌క్లేవ్‌-2024’ ఈవెంట్‌ నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు తయారు చేసిన వివిధ రకాల నూతన ప్రయోగాలను ప్రదర్శించారు.

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు మంగళవారం సాధన చేశారు. 

 కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌తో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సమావేశమయ్యారు.

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

Eenadu.net Home