చిత్రం చెప్పే విశేషాలు

(04-09-2024)

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన నాగదీప్‌ గత రెండు సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని కాపాడాలనే ఆశయంతో వివిధ ఆకృతులు కలిగిన మట్టి విగ్రహాలను కోల్‌కతా నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు.

మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో వరద కారణంగా విలువైన పత్రాలు తడవడంతో మంగళవారం వాటిని శైలజ అనే మహిళ ఇలా ఆరబెడుతూ కనిపించారు.   

ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా విజయవాడలోని సింగ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి.  ఓ తండ్రి చిన్న బకెట్‌లో తన కొడుకును పెట్టుకుని నీటిలో బయటకు వస్తున్నకనిపించారిలా..

భారీ వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం చెరువులో భారీగా వరద నీరు చేరింది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. మండలాల్లో ఆయా చెరువులు పూర్తిగా నిండిపోయయి. 

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం వద్ద తమ ఇళ్లు నీట మునగడంతో రోడ్లపైకి చేరిన వరద బాధితులు..

చుట్టూ నల్లమల అడవులు.. కనుచూపు మేరలోనే నాగార్జునసాగర్‌ డ్యాం వెనుక జలాలు.. చూసేందుకు ఆహ్లాదం.. వెళ్లేందుకు ఆనందం కలిగించేలా ఉంది కదూ ఈ చిత్రం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమీపంలోని ‘బుద్ధవనం’ అందాలివి.  


 విశాఖ జిల్లా చింతూరు మండలం పొల్లూరు వద్ద కొండ పైనుంచి కిందకు జాలువారుతున్న జలపాతం ..

నీలిమేఘాలు నేలకు దిగినట్లుగా వచ్చేశాయి.. సాయంత్రం వేళ మేఘాలు ఇలా కమ్ముకుని ఆహ్లాదాన్ని పంచాయి. చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం బొమ్మరాజుపల్లి గ్రామ చెరువుపై మేఘాలు అలా కొద్దిసేపు కమ్మేసి.. కాసేపటికే వర్షం కుమ్మేసింది.  

చిత్రం చెప్పే విశేషాలు

ఇతరులకు భిన్నంగా నిలబెట్టేవి ఏంటో తెలుసా?

చిత్రం చెప్పే విశేషాలు

Eenadu.net Home