చిత్రం చెప్పే విశేషాలు

(05-09-2024)

జనగామ జిల్లాలోని కోనాయచలంలో చెక్‌డ్యాం వద్ద సింగారపు లింగారపు లింగమూర్తికి 15 కిలోల గ్యాస్‌కట్‌ అనే చేప చిక్కింది. 

బసవనగుడి ప్రాంతంలోని ఇండియన్‌ వరల్డ్‌ కల్చర్‌ ఆడిటోరియంలో శ్యామల అనే కళాకారిణ ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనలో 75 మందికి పైగా కళాకారులు తమ క్యాన్వాస్‌పై రూపొందించిన గణపతులను ప్రదర్శనకు ఉంచుతారు. 

సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లికి చెందిన రైతు కుటుంబం మట్టి గణపతులను తమ పొలంలో తయారుచేస్తున్నారు. మట్టి గణపతులకు వాటర్‌ పెయింటింగ్‌లు వేసి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో చినదొడ్డిగల్లుకు చెందిన కార్పెంటర్, సూక్ష్మకళాకారుడు దార్ల రవి ఓ చెక్కపై టీచర్‌ పేరుతోపాటు, ఇందులోనే పెన్, పుస్తక ఆకారాన్ని మలిచాడు. ఇందుకోసం గంట సమయం పట్టినట్లు వెల్లడించాడు. 

కాజీపేట విష్ణుపురిలోని శ్వేతార్క ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆది గణపతిని వివిధ కూరగాయలతో శాకంబరిగా అలంకరించి సప్తవర్ణాభిషేకం, పూజలు చేశారు. 

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పచ్చని పూలవనం అనుకుంటే పొరబడినట్లే. హనుమకొండలోని చారిత్రక పద్మాక్షి ఆలయ ఆవరణలోని గుండంలో గుర్రపుడెక్క దట్టంగా పెరిగింది. పూలు పూయడంతో పూల వనాన్ని తలపిస్తోంది. 

ధర్మారం: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జలవనరులు నిండుకుండలా మారాయి. ఎల్లంపల్లి ఎత్తిపోతలతో నంది జలాశయంలో నీరు ఇది.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ‘గురు’ అక్షరాల ఆకృతిలో కూర్చొని ఉపాధ్యాయులు మీద అభిమానాన్ని పిల్లలు ఈ విధంగా చాటుకున్నారు.

చుట్టూ గుట్టలు.. పచ్చని చెట్ల నడుమ కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం రామసముద్రం కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో చెరువు మత్తడి పారి జలపాతాన్ని తలపిస్తోంది. 

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home