చిత్రం చెప్పే విశేషాలు

(06-09-2024)

అకస్మాత్తుగా పెద్దశబ్దంతో హెలికాప్టర్‌ పొలంలో దిగడంతో రైతులు ఆశ్చర్యపోయారు. వరద బాధితుల సహాయార్థం విజయవాడకు వెళ్లి పని ముగించుకుని నగరానికి బయలుదేరిన ఓ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లా చిట్యాల శివారులోని పొలంలో అత్యవసరంగా దింపారు.

 అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మూడున్నర అడుగుల మట్టి వినాయక విగ్రహంపై 1116 చిన్నసైజు మట్టి ప్రతిమలు అమర్చి రూపొందించిన విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ధాన్యం, సగ్గుబియ్యం, ఆవాలు, గసగసాలు, ఎర్రకందిపప్పు, బాదం పప్పుతో అలంకరించారు.  

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బాలాలయం పూజలకు అంకురార్పణ చేయనున్నట్లు తితిదే ఉప కార్యనిర్వహణాధికారి నటేష్‌బాబు తెలిపారు.సీతారామలక్ష్మణమూర్తుల శిల్పాలను ప్రత్యేకంగా తయారు చేయించామని తెలిపారు. 

చుట్టూ పచ్చని పొలాలు, ఎతైన కొండల మధ్య ఉన్న నల్గొండ జిల్లా మర్రిగూడలో ప్రకృతి ప్రేమికుల్ని పరవశించేలా చేస్తోంది. నేల తల్లికి ఆకుపచ్చ రంగు చీర కట్టినట్లు ఓవైపు వరి పంటలు, వాటి నడుమ అక్కడక్కడ ఇళ్లు.. అక్కడ నివసించే పరిసర ప్రాంత వాసులకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.

విజయనగరం జిల్లా పర్యాటక కేంద్రం అరకు ముఖద్వారంగా గుర్తింపు పొందిన తాటిపూడి జలాశయం అవతల ఉన్న ఈ ప్రాంతం పచ్చదనం, సోయగాలు మనసును దోచేస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గిరులు మంచుతో చూపరులను మైమరిపించాయి. 

 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటాన్నిఅన్నమయ్య జిల్లా రామాపురం అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఆర్ట్‌ మాస్టర్‌ గా పనిచేస్తున్న ఆనంద్‌రాజు తన రక్తంతో గీశారు. ప్రిన్సిపల్‌ వరప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. 

కొబ్బరి పీచుతో తయారయ్యే కళాత్మక బొమ్మలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలోని 216 జాతీయ రహదారి ఆనుకుని గ్రామీణ దుకాణ్‌ ద్వారా నాబార్డ్, ఆక్సిజన్‌ అసోసియేషన్‌ మహిళలకు వీటి రూపకల్పనలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. 

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని ముదిగొండ గ్రామ శివారులోని మాటు(కుంట) ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి పోస్తోంది. జలపాతం మాదిరిగా నీటి బిందువులు కిందకి జాలువారుతున్నాయి.

కాకినాడ నగరం జగన్నాథపురం నేతాజీ పార్కు సమీపంలో విశాఖ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సభ్యులు ఈ కోవలోనే వినూత్నంగా పంచదారతో విగ్రహాన్ని తయారుచేశారు. చీరాల నుంచి కళాకారులను తీసుకొచ్చి రూ.1.25 లక్షల వ్యయంతో 15 అడుగుల ఎత్తున దీనిని రూపొందించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

Eenadu.net Home