చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 

అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల కన్సార్షియం ‘ఐటీసర్వ్‌ అలయెన్స్‌’ తమ వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు, ప్రత్యేక అతిథిగా మంత్రి లోకేశ్‌కు ఆహ్వాన పత్రం అందించింది. 

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

 లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబుకి చెక్కు అందించారు. 

బీర్కూర్‌లో చేపట్టిన నాలుగు వరుసల రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు చదును చేస్తున్న క్రమంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలింది. దీంతో మిషన్‌ భగీరథ నీరు పది అడుగుల ఎత్తులో ఫౌంటెయిన్‌లా నీళ్లు ఎగిసి పడ్డాయి.

నెల్లూరులో బంగారు వినాయకుడు కొలువు తీరాడు. నగరంలోని గుప్తా పార్క్ వద్దున్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ బంగారు వినాయకుడు అలరిస్తున్నాడు.

సుధీర్‌బాబు కథానాయకుడిగా... అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. ఆర్ణ కథానాయిక.ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home