చిత్రం చెప్పే విశేషాలు
(13-09-2024/1)
పర్యాటక ప్రాంతమైన యానాం రాజీవ్ రివర్‌బీచ్‌లో గురువారం సాయంత్రం సూరీడు ఒక్కసారిగా ఎరుపెక్కి రుధిర వర్ణ రాగరంజితంగా కనిపించాడు. గోదావరి మాత విగ్రహం వద్ద ఈ అపురూప దృశ్యం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
ముఖ్యమంత్రి సహాయనిధికి ఏఎమ్ఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రూ.కోటి విరాళంగా అందించింది. కంపెనీ ఎండీ మహేష్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందజేశారు.
పోర్చగల్‌కు చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చరిత్రను లిఖించాడు. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది.
డుడుమ జలపాతం. ఎత్తయిన కొండల్లోంచి 550 అడుగుల లోయలోకి జల ప్రవాహం ఉరకలెత్తుతోంది. దీనిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవీ మార్కెట్‌లో గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని రూ.2.70 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు.
నారాయణగూడలోని జాహ్నవీ కళాశాల ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఆటపాటలతో సందడిగా గణేశుడిని నిమజ్జనం చేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధిగా నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళంగా అందించారు. బాలకృష్ణ తరఫున ఆయన కుమార్తె తేజస్విని సీఎం రేవంత్‌కు చెక్కును అందజేశారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరీ గురువారం మృతి చెందారు. వీరికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.
జెట్టి హీరో కృష్ణ మనినేని తన 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు రూ. 10 లక్షలు సహాయ అందించారు. వీరికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
2011లో రిలీజ్ అయిన జర్నీ చిత్రం మళ్లీ రీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 21న రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది.