చిత్రం చెప్పే విశేషాలు

(15-09-2024/1)

అనంతగిరి- దేవరాపల్లి మండలాల రైవాడ జలాశయం నిండుకుండలా మారింది. సూర్యాస్తమయ వేళలో అరుణ వర్ణంలో ఉన్న ఆకాశం ప్రతిబింబం నీటిపై పడుతుండగా.. నీటి మధ్యలో ఉన్న చెట్లు.. జలాశయానికి ఆనుకుని ఉన్న ఎత్తయిన కొండల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

నగర మేయర్‌ విజయలక్ష్మి మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో సమస్యల గురించి నగరవాసులను అడిగి తెలుసుకున్నారు. 

శని, ఆదివారాలు సెలవు రోజుకావడంతో ఖైతరాబాద్‌ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 

నటి మేఘా ఆకాశ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయివిష్ణుతో ఆమె ఏడడుగులు వేశారు. 

బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్, ఏఐజీ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 

 రవీంద్రభారతిలో శనివారం కూచిపూడి రంగ ప్రవేశ కార్యక్రమం జరిగింది. నృత్యకారిణి మహిక పొట్లూరి కూచిపూడి రంగ ప్రవేశం చేశారు. ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏబీ వెంకటేశ్వర్ రావు, ప్రముఖులు, నాయకులు, తదితరులు హాజరయ్యారు.

హైటెక్‌సిటీలో హైలైఫ్‌ జువెల్స్‌ ఎగ్జిబిషన్‌ను శనివారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్‌ జరగనుంది. సినీ నటి తేజస్వి హాజరై నూతన బంగారు ఆభరణాలతో ఫొటోలు దిగి సందడి చేశారు.

నటుడు రిషబ్ షెట్టి ఓనం పండుగ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. సతీమణితో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home