చిత్రం చెప్పే విశేషాలు

(18-09-2024/1)

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూకట్‌పల్లిలోని నల్ల చెరువులోకి వర్షపు నీరు చేరింది. చెరువులో గుర్రపు డెక్క భారీగా పెరిగి ఇలా మైదానాన్ని తలపిస్తోంది. 

గతేడాది అక్టోబరులో విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్‌’కు కొనసాగింపుగా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ రానుంది. తాజాగా ఈ సీక్వెల్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను టీమ్‌ రిలీజ్‌ చేసింది. 

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం కొనసాగుతోంది. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కోసం భారీ గణనాథుల విగ్రహాలు బారులు తీరాయి.

వరద బాధితుల కోసం సినీ నటి అనన్య రూ. 5 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి రూ.2.5 లక్షల చెక్కును ఆమె అందజేశారు. 

కరీంగనర్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండిసంజయ్‌ పాల్గొన్నారు. పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. 

తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార తాజాగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేశారు. ‘నువ్‌ కన్న కలలు అన్ని నిజం కావాలి’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 

 హైదరాబాద్‌లో వినాయక సందడి ముగిసింది. కూకటపల్లి పైవంతన వద్ద రోడ్లు ఇలా నిర్మానుష్యంగా కనిపించాయి.

యూకేలో డాల్బీ అట్మాస్‌లో ప్రదర్శించనున్న తొలి తెలుగు చిత్రంగా ‘దేవర’ నిలవనుంది. ఈనెల 26న ప్రీమియర్స్‌ వేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఆనందం వ్యక్తంచేసింది.

వరద బాధితులకు కోసం కుమారీ ఆంటీ రూ.50 వేలు విరాళం అందించారు. దీంతో రేవంత్‌ను కలిసి చెక్కును అందజేశారు.

స్ఫూర్తి నింపే విషయాలివీ

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home