చిత్రం చెప్పే విశేషాలు

(22-09-2024/1)

క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, ‘భారత్-అమెరికా’ వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వాన పత్రిక అందించారు.

తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

 శ్రీ భద్రకాళీ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని ఉన్న చోటే నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

సుధీర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఉస్మానియా యూనివర్సిటీలో సందడి చేసింది. 

ఎన్టీఆర్‌ - జాన్వీ కపూర్‌ నటించిన ‘దేవర’ సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఆదివారం మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను సినీనటి కీర్తి సురేశ్‌ ప్రారంభించారు. నూతన వస్త్రాలతో ఫొటోలు దిగారు.

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సిద్స్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌ హెల్త్‌ రన్‌’ పేరిట ఆదివారం 10కె, 5కె, 2కె రన్‌ నిర్వహించారు. ఉద్యోగులు, యువత, చిన్నారులు ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

Eenadu.net Home