చిత్రం చెప్పే విశేషాలు
(23-09-2024/1)
క్వాడ్ సదస్సు, ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన మోదీ 15 కంపెనీల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’.వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
వరద బాధితుల సహాయార్థం మహేశ్‌బాబు రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం నమ్రతతో కలిసి చెక్కును సీఎం రేవంత్‌కు అందజేశారు.
దిల్లీ నూతన సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు.
అన్నవరం దేవస్థానం లో శాంతి హోమం ఘనంగా నిర్వహించారు. వైదిక బృందం ఆధ్వర్యంలో వినాయక పూజ, పుణ్యాహవచన, మండపారాధన, స్వామి, అమ్మవార్ల ఆవాహన, హోమం, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా చేశారు.
న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు దాదాపు 13వేల మంది హాజరయ్యారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా సోమవారం శాంతి హోమం నిర్వహించారు. శాంతి హోమం, అన్ని విభాగాల్లో పంచగవ్య ప్రోక్షణ చేశారు.
సందీప్ కిషన్ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘మజాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం చిత్రబృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.