చిత్రం చెప్పే విశేషాలు

(24-09-2024/1)

పవన్‌కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం మెట్లను శుభ్రం చేసి.. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెల‌క్టర్‌ ఎం.ఎస్‌.కే ప్రసాద్‌ విరాళం అందించారు. రూ.3లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాట పట్టారు. తిరుపతిలో ఆందోళన చేపట్టారు.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సోమవారం భీకరస్థాయిలో విరుచుకుపడింది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. 

దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా విశ్వం టీమ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది.

బాలీవుడ్‌ నటి అలియా భట్‌ తొలిసారి పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో మెటాలిక్‌ డ్రెస్‌లో రన్‌వేపై స్టైల్‌గా నడిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

దేవర మరో రికార్డును సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా రెండు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది. 

పిచ్చుకలు ఎంతో అందంగా గూళ్లు నిర్మించుకుంటాయి. మంగళవారం ఓ పిచ్చుక ఇలా గూడు కడుతూ కనువిందు చేసింది. కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కనిపించిందీ దృశ్యం.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home