చిత్రం చెప్పే విశేషాలు

(28-09-2024/1)

ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ వచ్చారు. ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి యజ్ఞమూర్తులకు ప్రత్యేక అర్చన నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను ఆరాధిస్తూ లక్ష పుష్పాలతో అర్చన జరిపారు.

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నటుడు మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును అందజేశారు.

నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పీహెచ్‌డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు

మాదాపూర్‌లోని స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌లో హైదరాబాద్‌ వేగాన్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని అమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి

కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం దేవర. ఈ నెల 27న రిలీజై ఘన విజయం సాధించింది. మొదటి రోజు కలెక్షన్లపరంగా టాప్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్‌) సాధించింది.

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(10-12-2024)

Eenadu.net Home