చిత్రం చెప్పే విశేషాలు

(29-09-2024/1)

యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం కావడంతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. 

గచ్చిబౌలి స్టేడియం నుంచి శనివారం పింక్‌ పవర్‌ రన్‌ నిర్వహించారు.కార్యక్రమంలో పెద్దఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు.

సైబరాబాద్‌లోని రాయదుర్గంలో అరోహ ఏస్థెటిక్‌ కాస్మొటాలజీ క్లినిక్‌ను ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా సినీ నటి తేజస్వి మదివాడ హాజరయ్యారు. పలువరు మోడళ్లు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.  

 సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. 

ప్రముఖ నటుడు రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్న ‘మిస్టర్‌ ఇడియట్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా మూవీ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

మణికొండలో ఆదివారం మాంగళ్య షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి శ్రీలీల హాజరయ్యారు. షోరూంను ప్రారంభించి నూతన వస్త్రాలతో ఫొటోలు దిగారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home