చిత్రం చెప్పే విశేషాలు

(30-09-2024/1)

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 3 నుంచి దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు ఆలయ అధికారులు ఆహ్వానం అందించారు. 

సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనిసిపిస్తున్న దృశ్యాన్ని రెంటచింతల నుంచి గురజాల వెళ్లే రహదారిలో వాహన చోదకుడు ఒకరు తన సెల్‌ఫోన్‌లో ఆదివారం సాయంత్రం క్లిక్‌ మనిపించారు. 

మంత్ర ఫేమ్‌ దర్శకుడు ఓషో తులసీరామ్‌ ‘దక్షిణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ముఖ్య అతిథులుగా నటుడు శివాజీ, ఆర్పీ పట్నాయక్‌ హాజరయ్యారు. 

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం మట్కా. మంగళవారం దీని రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది. 

మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప చిత్ర షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఇందులో ‘పిలక-గిలక’గా నటిస్తోన్న బ్రహ్మానందం, సప్తగిరిల పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. 

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘రా మచ్చా.. మచ్చా’ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

నాగచైతన్య-సాయిపల్లవి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రానుంది. తాజాగా ఇందులోని ఓ పాటకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

జెర్మనీలోని బెర్లిన్‌లో ఆదివరాం బీఎమ్‌డబ్ల్యూ మారథన్‌ నిర్వహించారు. తెలంగాణ ఐపీఎస్‌ అధికారి మస్తీపురం రమేశ్‌ ఈ రన్‌ను పూర్తి చేశారు. 

స్ఫూర్తి నింపే విషయాలివీ

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home