చిత్రం చెప్పే విశేషాలు

(01-10-2024/1)

మాజీ మంత్రి కేటీఆర్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ను పరామర్శించారు. ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం మట్కా. దీనిని నవంబర్‌ 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

చౌటుప్పల్‌లోని ట్రినిటీ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సుమారు 24 అడుగుల భారీ బతుకమ్మను తయారు చేశారు.

తిరుమలలో అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేశారు.  

మంగళవారం నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో వసతి గృహాల్లో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారిని తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులను చూడగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

 సోమాజిగూడలోనీ రెజెన్సీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ‘తెలుగు తరంగం’ కార్యక్రమం నిర్వహించారు. తెలుగింటి భోజనాలతో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.

 దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల, గ్రామీణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన చేనేత, హస్తకళ, ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. నగరంలోని నక్లెస్‌ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.

ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో అలరించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(21-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(20-12-2024)

Eenadu.net Home