చిత్రం చెప్పే విశేషాలు

(04-10-2024/1)

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్కరించుకుని తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ‌ల‌పుష్ప, అట‌వీ, శిల్ప, ఫొటో ప్రదర్శనశాల ఆకట్టుకుంటోంది.

ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్ఏనారు. శ్రీ పద్మావతి గృహం వద్ద పుష్ప గుచ్ఛం అందజేసి సీఎంకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. 

హైదరాబాద్‌లోని నల్లగండ్లలో చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ను సినీనటి వైష్ణవి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలతో ఫొటోలు దిగి సందడి చేశారు.

హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌, హైదర్‌గూడ, బషీర్‌బాగ్‌, నిజాంకాలేజ్‌ ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. విపరీతమైన ఉక్కపోత అనంతరం ఒక్కసారిగా వర్షం పడింది.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ డెక్కన్‌లో సితారా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. సినీనటి వర్ష, పలువురు మోడల్స్‌ హాజరై సందడి చేశారు.  

దసర శరన్నవరాత్రుల్లో భాగంగా వరంగల్‌ లోని భద్రకాళీ అమ్మవారు శుక్రవారం అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు అభయమిచ్చారు. 

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దాండియా ఆటపాటలతో కొండాపూర్‌లోని స్నోకింగ్‌ డమ్‌ అలరిస్తోంది. యువతులు సంప్రదాయ వస్త్రధారణతో వచ్చి సందడి చేస్తున్నారు. 

విజయవాడలో దసరా శరన్నవరాత్రులు ఉత్సాహంగా సాగుతున్నాయి. అమ్మవారిని పల్లకిపై ఊరేగించారు. భక్తులు విశేషంగా హాజరయ్యారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home