చిత్రం చెప్పే విశేషాలు

(07-10-2024/1)

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారిని కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. 

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు సోమవారం ధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. 

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో మార్గదర్శి బ్రాంచ్‌ను ప్రారంభించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ హజరై బ్రాంచ్‌ను ప్రారంభిచారు. 

ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌గా పీఎస్‌ మునిరత్నం బాధ్యతలు చేపట్టారు. మంత్రి నిమ్మల ఆయనకు అభినందనలు తెలిపారు.

అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైల్డ్‌లైఫ్‌ వారోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌పై ‘8 వసంతాలు’ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో నటి అనంతిక శుద్ధి పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్‌ 12న విడుదల చేయనున్నారు.

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సోమవారం మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు దర్శనార్థం భారీగా వచ్చారు. 

శివ కార్తికేయన్‌, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం అమరన్‌. ఇందులో తొలి పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. 

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

Eenadu.net Home