చిత్రం చెప్పే విశేషాలు

(08-10-2024/1)

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం గరుడ సేవ ఉండటంతో భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. 

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా భద్రాచలం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు మంగళవారం ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళీ అమ్మవారు భవానీమాతగా దర్శనమిచ్చారు.

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తన సతీమణితో కలిసి మంగళవారం తాజ్‌మహల్‌ను సందర్శించారు.

 ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొలువైన గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి మండపాన్ని రూ.2.20 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘రాజా సాబ్‌’. మంగళవారం మారుతీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. 

చిత్రం చెప్పేవిశేషాలు(21-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(20-12-2024)

Eenadu.net Home