చిత్రం చెప్పే విశేషాలు (14-10-2024)

ప్రధాని మోదీని కలిసిన దిల్లీ సీఎం ఆతిశీ సింగ్‌

 ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండగ’ వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా కృష్ణా జిల్లా కంకిపాడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇటీవల సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కుమార్తె మరణించడంతో అతడిని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. 

వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిసన్‌ రెడ్డి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వెయ్యి స్తంభాల మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు..

ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహానికి మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు.

దసరా సెలవులు ముగిసిన సందర్భంగా పలు బస్టాండ్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది.

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

Eenadu.net Home