చిత్రం చెప్పే విశేషాలు

(15-10-2024)

నేవీ రాడార్‌ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి.

అంబర్‌పేట్ నియోజకవర్గం, పటేల్ నగర్‌లో ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నోట్‌ బుక్స్‌ పంపిణీ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 

నగరంలో ఎండా వానలు దోబూచులాడి.. చూపరులకు కనువిందు కలిగించాయి.

శస్త్రచికిత్స తర్వాత రజనీకాంత్‌ తొలిసారి కనిపించారు. టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కించిన చిత్రం‘వేట్టయన్‌’భారీ విజయం సాధించడంతో రజనీని కలిసి ఫొటోను పంచుకున్న యూనిట్‌

విజయనగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం. జనసందోహంగా మారిన సిరిమాను ఊరేగింపు మార్గం.

నటి రష్మిక ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈవిషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్‌ దోస్త్ విభాగం ప్రకటించింది.

హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సందడిగా నటుడు సాయి దుర్గాతేజ్‌ పుట్టినరోజు చేసుకున్నారు. 

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ దాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

నేడు హీరో సాయి దుర్గా తేజ్ సందర్భంగా #SDT18 వర్కింగ్‌ టైటిల్‌తో కొత్త సినిమా ప్రకటించారు.

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

Eenadu.net Home