చిత్రం చెప్పే విశేషాలు

(16-10-2024/1)

చెన్నై నగరంలో  భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. వరసగా రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కలిశారు. ఈ నెల 19న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న మ్యూజిక్‌ కాన్సర్ట్‌కు రేవంత్‌, భట్టివిక్రమార్కను దేవిశ్రీ ప్రసాద్‌ ఆహ్వానం పలికారు.

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 - తాండవం’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగింది. బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు.

ఏపీలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతా చల్లని వాతావరణం నెలకొంది. దీంతో తిరుమలలో బుధవారం ఇలా మంచుకురిసి కనువిందు చేసింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన పోస్టు పెట్టారు. మా నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ డాడ్.. అంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

ఏపీలో మూడో రోజు వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.  

ఆదిలాబాద్‌ పట్టణం బస్టాండ్‌ సమీపంలో సీతాకోక చిలుకలు గడ్డి పూలల్లో ఉండే మకరందాన్ని పోటీ పడుతూ తాగుతున్నాయిలా..  

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(10-12-2024)

Eenadu.net Home