చిత్రం చెప్పేవిశేషాలు

(22-10-2024)

సింగూరు గేట్లు ఎత్తడంతో ఏడుపాయల ఆలయం ఎదుట ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది.

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు మంగళవారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.

కజాన్‌లో నిర్వహించనున్న 16వ బ్రిక్స్‌ సమ్మిట్‌ నిమిత్తం రష్యా వెళ్లిన ప్రధాని. ఆయనకు ఘన స్వాగతం పలికిన భారత సంతతి ప్రజలు.

టీమ్‌ఇండియా క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రయ్యాడు. అతడి సతీమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ ఆనందకర విషయాన్ని సర్ఫరాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

అనంతపురం నగరాన్ని ముంచెత్తిన వరదలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పండమేరు వాగు . పూర్తిగా నీటమునిగిన కాలనీలు.

అరవింద్‌ స్వామి - కార్తి నటించిన చిత్రం ‘సత్యం సుందరం’నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 27 నుంచి ప్రసారం కానుంది. 

అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సమ్మిట్‌కు హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్‌, మంత్రులు బీసీ జనార్దన్‌ రెడ్డి, అనిత, అచ్చెన్న, సంధ్యారాణి.

‘‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. ‘నేను రౌడినే’ 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటా. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’’అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు నయనతార. 

ఆకుపచ్చని తివాచీపై భువనగిరి ఖిల్లాను కూర్చోపెట్టినట్లుగా ఉంది. నల్గొండ రోడ్డు వైపు సాగు చేసిన పచ్చని పైర్లు కనువిందు చేస్తున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home