చిత్రం చెప్పేవిశేషాలు

(24-10-2024)

డాక్టర్ కాకర్ల సుబ్బారావు శతబ్ది వేడుకల సందర్బంగా 

మాదాపూర్ శిల్పకళా వేదికలో ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను జోతి వెలిగించి ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సంధ్యాసమయంలో తుంగభద్ర అందాలు కనువిందు చేశాయి.

అదా శర్మ నటించిన చిత్రం ‘సీడీ’ఆహా వేదికగా అక్టోబర్‌ 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను ప్రభావం కారణంగా జిల్లాలోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి వివిధ రంగుల్లో ఆకాశం కనిపించింది..సూర్యాస్తమయ వేళ నింగి ఒక్కసారిగా ఊదా రంగులోకి మారింది. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో నేడు జీఎం అరుణ్ సమావేశం రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వేలైన్‌, ఆర్వోబీలు, అండర్‌ పాస్‌ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న ఎంపీలు, సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.

వాయవ్య బంగాళాఖాతంలో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌.

అమెరికన్‌ మల్టీనేషనల్‌ టెక్నాలజీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ను బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కలిశారు. ఈ విషయాన్ని అక్షయ్‌ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గురువారం సూర్యాపేటలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ఆయన పరిశీలించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home