చిత్రం చెప్పేవిశేషాలు

(29-10-2024)

ధన త్రయోదశిని పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని పలు నగల దుకాణాల్లో నగరవాసుల సందడి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్న నగరవాసులు.

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ అప్‌డేట్ వచ్చేసింది. ‘జై హనుమాన్‌’ ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది.

అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించారు. డిజిటల్‌ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని ఈ భేటీలో లోకేశ్‌ కోరారు.

నటుడు రాఘవ లారెన్స్ కొత్త సినిమా ‘బుల్లెట్‌ బండి’నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

లేపాక్షి బొమ్మలపై ఇష్టంతో, తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగాలేపాక్షి బొమ్మల శాశ్వత ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేయించిన ఉప ముఖ్యమంత్రి వీటితో పాటుగా సవరా తెగకు చెందిన గిరిజనులు ఎంతో ఇష్టంతో పంపించిన బహుమతులను ఎంతో ఇష్టంతో అందుకుని సంతోషపడ్డారు.

ఇదేంటి ఈ ఫొటోలో కనిపిస్తున్నది పంట పొలాలు అనుకుంటున్నారా? కాదు మల్కాజిగిరి లోని నేరేడ్‌మెట్ లోని రామకృష్ణాపురం చెరువు. ఒకప్పుడు నిండుకుండను తలపించే ఈ చెరువు గత ఐదేళ్లుగా నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా గడ్డి, గుర్రపు డెక్కతో నిండి ఇలా పొలాన్ని తలపిస్తున్న దృశ్యమిది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మొడెం వంశీ.

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన సందర్భంగా వంశీని అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.

పుట్టినరోజు సందర్భంగా రాఘవా లారెన్స్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు

ఆయన 25వ సినిమాగా ‘కాల భైరవ’ తెరకెక్కనున్నట్లు వెల్లడించారు

పాన్‌ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది.

ఏక్తా దివస్‌లో భాగంగా అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home