చిత్రం చెప్పేవిశేషాలు

(30-10-2024)

నందమూరి హరికృష్ణ మనవడు తారక రామారావును పరిచయం చేసిన దర్శకుడు వైవిఎస్‌ చౌదరి. 

దీపావళి సందర్భంగా నగరంలో జోరుగా సాగుతున్న పువ్వుల అమ్మకాలు.

నటి నయనతార జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ సిద్ధం చేసిన విషయం తెలిసిందే నవంబర్‌ 18 నుంచి అది స్ట్రీమింగ్‌ కానుంది. ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే టైటిల్‌ పెట్టారు.

పెప్సికో మాజీ మాజీ ఛైర్మన్, సీఈవో ఇంద్రా నూయి, సీఈవో ఇంద్రా నూయితో భేటీ అయిన మంత్రి నారా లోకేశ్‌. 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులు.

మంగళవారం ధన త్రయోదశి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొండాపూర్‌లోని ఓ మాల్‌లో దీపకాంతులు.

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు.

గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్‌ కోర్సు క్లబ్‌ల ఏర్పాటుకు ‘ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ఛైర్మన్, మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ముందుకొచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి చర్చించారు. 

హైదరాబాద్‌లో బాణసంచా మెరుపులు.. బాణసంచా స్టాళ్ల వద్ద చిన్నారుల సందడి నెలకొంది.  

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home