చిత్రం చెప్పేవిశేషాలు

(31-10-2024)

దీపావళిని పురస్కరించుకొని అయోధ్యలోని సరయూ నదీతీరంలో దీపోత్సవ కాంతులు.

అమెరికాలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్ కురియన్, వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్ కోలేతో ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్‌ క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

గుజరాత్‌లోని కచ్‌లో సైనికులకు మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. ప్రతి దీపావళిని సైనికులతో కలిసి నిర్వహించుకుంటున్న మోదీ. 

గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్.

శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన వేడుకల్లో దీపాలతో యువతులు.

కరీమాబాద్‌ ఉర్సు రంగలీలా మైదానంలో దీపావళిని పురస్కరించుకొని నరకాసుర వధ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. జూబ్లీహిల్స్ నివాసంలో చిత్రపటాలకు నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించి ఐక్యతా ప్రమాణం చేశారు.

దీపావళి సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home