చిత్రం చెప్పేవిశేషాలు

(1-11-2024)

సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. తెదేపా నాయకులు, అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

కరీంనగర్‌లో దీపావళి వేడుకల్లో కేంద్రమంత్రి బండి సంజయ్‌, సిబ్బంది.

రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జై హనుమాన్‌’. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

నగంరలో గురువారం దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు ఇళ్ల ముందు దివ్వెలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘హాలోవీన్’ వేడుకల్లో సందడి చేశారు. తన భార్య, ముగ్గురు కుమార్తెలు పలు గెటప్పుల్లో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో మార్క్‌ షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

అల్లూరి జిల్లా పాడేరు ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మేఘాలకొండలో మంచు అందాలు చూసేందుకు తరలి వస్తున్న పర్యాటకులు.

ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శుక్రవారం ఉదయం 'గిరి ప్రదక్షిణ' నిర్వహించారు. భక్తజనుల జయ జయ నినాదాల మధ్య భారీ ఎత్తున ఈ వేడుక జరిగింది. 

దీపావళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను పలువురు స్టార్‌ హీరోలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(02-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(01-01-2025)

Eenadu.net Home