చిత్రం చెప్పేవిశేషాలు

(2-11-2024)

రోడ్లు నాగరికతకు చిహ్నం.. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. అనకాపల్లిలో శనివారం ఆయన పర్యటించారు. దీనిలో భాగంగానే రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

ఖైరతాబాద్, మూసాపేట ప్రాంతాల్లో శుక్రవారం సదర్‌ ఉత్సవాలు సందడిగా జరిగాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో పలు ప్రాంతాల నుంచి దున్నరాజులను అలంకరించి తీసుకువచ్చి డప్పులు, నృత్యాలతో ఆడిస్తూ విన్యాసాలు చేశారు.

శివకార్తికేయన్‌ నటించిన యాక్షన్‌ వార్‌ మూవీ ‘అమరన్‌’చిత్రాన్ని రజనీకాంత్‌ వీక్షించారు. శివ కార్తికేయన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామిని అభినందించారు.

శుక్రవారం సాయంత్రం గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు, అండర్‌ పాస్‌లు నీటితో నిండిపోయాయి. కొత్తగూడ నుంచి కొండాపూర్‌ వెళ్లే మార్గంలో భారీగా వరద చేరింది. బయో డైవర్సిటీ నుంచి ఐకియా కూడలి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచింది.

అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పరిశ్రమల ప్రతినిధుల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై నమ్మకం కలిగించారు.

నెక్లెస్‌రోడ్‌లో నేడు దక్షిణ మధ్య రైల్వే ఇంటిగ్రిటీ వాకథాన్‌ నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ జైన్‌ ఈ వాకథాన్‌ను ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు వాకథాన్‌ జరిగింది. 

కార్తిక మాసం మొదటి రోజు సందర్భంగా..పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ కార్తిక దీపాలు వదులుతున్న భక్తులు.

శ్రీశైలంలో నేటి నుంచి డిసెంబర్‌ 1 వరకు కార్తిక మాసోత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా శని, ఆది, సోమవారాల్లో మల్లన్న సర్వదర్శనం నిలిపివేశారు. 

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న ‘మట్కా’ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(02-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(01-01-2025)

Eenadu.net Home