చిత్రం చెప్పే విశేషాలు

(03-11-2024/1)

కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. 

అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగి కొండల్లో మంచు సోయగం అబ్బురపరుస్తోంది. వంజంగి కొండలు సూర్య కిరణాల ప్రతిబింబంతో పర్యాటకులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

 మంత్రి పొంగులేటి వరంగల్‌ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్తికమాసం రెండో రోజు దాతలు ఇచ్చిన గాజులతో దుర్గమ్మను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

స్వయం డిజైనర్‌ స్టూడియో పేరుతో హైదరాబాద్‌లో డిజైనర్‌ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. సినీనటి ప్రణీత ఆదివారం దీనిని ప్రారంభించారు.

దిల్లీలో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. యమునా నదిలో విషపూరిత నురగ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయం మంచులా దట్టంగా పేరుకుపోయి నురగ ప్రవహించింది.

యాదవులు వైభవంగా చేసే సదర్‌ వేడుకలను నారాయణగూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 

మెగాస్టార్‌ చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన కిషన్‌ రెడ్డి.. ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి ఒకరినొకరు శాలువాతో సత్కరించుకున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home