చిత్రం చెప్పేవిశేషాలు

(04-11-2024)

విజయనగరం శివాలయం వీధి రామలింగేశ్వర స్వామి ఆలయంలో 50 వేల రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు.

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం ఉపముఖ్యమంత్రి పవన్‌ పర్యటించారు. దీనిలో భాగంగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌ ప్రారంభించారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు.

షారుక్‌ ఖాన్‌ను కలిసేందుకు ఝార్ఖండ్‌ నుంచి ముంబయి వచ్చిన అభిమాని. 95 రోజులుగా షారుక్‌ ఇంటి బయటే ఎదురుచూపులు. విషయం తెలుసుకున్న అభిమానితో మాట్లాడి, ఫొటోలు దిగారు.

సామర్లకోట భీమేశ్వరాలయంలో కార్తిక మాసం శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.  

కార్తిక సోమవారం సందర్భంగా గోదావరి నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. నదిలో కార్తిక దీపాలు వదిలారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత. రంగనాయకుల మండపంలో అనితకు వేదాశీర్వచనం చేసిన పండితులు.

యాదగిరిగుట్ట శివ,కేశవుల ఆలయంలో ప్రత్యేక పూజలు.


శ్రీశైలంలో కార్తిక మాసం సందడి నెలకొంది.

‘ది కెన్సల్‌ అసోసియేషన్ ఆఫ్‌ విజయవాడ’ నేతృత్వంలో నిర్వహించిన డాగ్‌షో ఆకట్టుకుంది. కానూరు షామ్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో ఆల్‌బ్రీడ్‌ ఛాంపియన్‌షిప్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. దీనిలో భాగంగా పెంపుడు శునకాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home