చిత్రం చెప్పేవిశేషాలు

(05-11-2024)

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప2’. డిసెంబర్‌ 5న విడుదల కానున్న సందర్భంగా నెలరోజులే ఉందంటూ.. కొత్త పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ.

పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్‌ భూములను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే యరపతినేని, కలెక్టర్‌, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రంలో డీఎస్పీల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హోంమంత్రి అనిత.

తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేయడంతో పాటు పుట్టల్లో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.

కౌన్సిలర్‌, ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన డాక్టర్‌ సుధీర్‌ . సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధీర్‌

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’తాజాగా దీని టీజర్‌ అప్‌డేట్‌ చెబుతూ పోస్టర్‌ విడుదల చేసింది మూవీ టీమ్‌. లఖ్‌నవూ వేదికగా ఈనెల 9న టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరగనుంది.


శ్రీకాళహస్తిలో నారద పుష్కరిణిలో దీపోత్సవ వైభవం. 

తన్నీరుబావి సమీపంలో సముద్రడి చెంతనే జాతీయ రహదారి. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home