చిత్రం చెప్పేవిశేషాలు

(06-11-2024)


వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు నందమూరి తారకరామారావు. నేడు ఈ అప్‌కమింగ్‌ హీరో పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే పోస్టర్‌ విడుదల చేసిన దర్శకుడు.

తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బీఆర్‌ నాయుడు, 16 మంది పాలక మండలి సభ్యులతో ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు.

ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ వద్ద ఓటు హక్కును వినియోగించుకున్న రిపబ్లికన్‌ తరఫు అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌.

పరమేశ్వరుడికి ఇష్టమైన కార్తికమాసాన్ని పురస్కరించుకొని జనగామ పట్టణంలోని అంబబావి సమీపంలో ఉన్న శివాలయంలో వేసిన ఈ రంగోలీ వచ్చిన భక్తులను ఎంతో ఆకట్టుకుంది.

రంగు రంగులతో బొమ్మలు వేయడం చూశాం.. నఖ చిత్రాలు గీయడం చూశాం.. కానీ.. ఈ బొమ్మ ఎలా వేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.  తాటాకులతో అద్భుత చిత్రాన్ని సృష్టించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ల సంబరాలు మొదలయ్యాయి.

ఓటు ఆవశ్యకతను వివరిస్తూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని సేల్స్‌ఫోర్స్‌ టవర్‌పై విద్యుత్‌దీపాలతో ప్రదర్శన.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌నకు సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home